ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రానున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ల కలయికలో దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న సినిమా పెద్ది అనే చెప్పాలి. చాలా రోజులు నుంచి బాక్సాఫీస్ దగ్గర ఒక సరైన సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర మిస్సయ్యింది అనే మాటకి సమాధానంగా పెద్ది భారీ హైప్ తో వస్తుంది.
అయితే రీసెంట్ గానే కొత్త డేట్ అనౌన్స్ చేసాక రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది గాడి ఆట మొదలైనట్టు తెలుస్తుంది. సీడెడ్, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అలానే నైజాం మార్కెట్ లలో పెద్ది భారీ బిజినెస్ ని చేస్తున్నట్టు తెలుస్తుంది. మేకర్స్ డిమాండ్ చేసిన మేరకి సైతం డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. సో సినిమా డిమాండ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


