‘పెద్ది’ రన్ టైమ్ పై బుచ్చి బాబు క్లారిటీ..!

‘పెద్ది’ రన్ టైమ్ పై బుచ్చి బాబు క్లారిటీ..!

Published on May 15, 2026 10:27 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఈ సినిమా సుమారు 3 గంటల 2 నిమిషాల నిడివితో ఉంటుందని వెల్లడించారు.

​ముఖ్యంగా ఈ చిత్రంలో చివరి 15 నిమిషాలు హైలైట్‌గా నిలవనున్నాయని, ఆ సమయంలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాడని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాల మొత్తం క్రెడిట్ రామ్ చరణ్‌కే దక్కుతుందని ఆయన ప్రశంసించారు. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మే 18న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

​వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు