ఓటీటీలో ‘పెద్ది’ సెన్సేషన్.. టాప్ 3లో ట్రెండింగ్‌..!

Peddi

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రన్ ముగించుకుని ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీ మినహా మిగిలిన అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ వ్యూస్‌తో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో 3వ స్థానంలో దూసుకుపోతోంది.

దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా చిత్రం, బలమైన ఎమోషన్స్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, ఆర్.రత్నవేలు అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో మిస్ అయిన వారికి ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో ఒక బెస్ట్ వాచ్‌గా నిలుస్తోంది.

Exit mobile version