రెహమాన్ మాస్ సంభవం.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో అదిరింది

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. భారీ హైప్ లో ఉన్న ఈ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు స్పెషల్ సాంగ్ తాలూకా ప్రోమో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి దీనికోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా ఈ సాంగ్ ప్రోమో కట్ ని మేకర్స్ విడుదల చేశారు.

అయితే ప్రోమో మాత్రం ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాల్సిందే. ఏ ఆర్ రెహమాన్ తన బీట్స్ తో మాస్ ని చూపిస్తే రామ్ చరణ్, శృతి హాసన్ అలాగే జాన్వీ కపూర్ లు ఫ్లోర్ మీద దుమ్ము లేపేసారని చెప్పవచ్చు. దీనితో ఈ ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ మరింత ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సాంగ్ రేపు మే 23న భోపాల్ లో గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేస్తున్నట్టు ఖరారు చేసారు. మొత్తానికి థియేటర్స్ లో మాత్రం ఈ సాంగ్ మోత మోగించేలానే ఉంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version