‘పెద్ది’ కోసం నార్త్ లో పెద్ద ప్లానింగ్ వేశారుగా..!

‘పెద్ది’ కోసం నార్త్ లో పెద్ద ప్లానింగ్ వేశారుగా..!

Published on May 1, 2026 7:52 PM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను నార్త్ బెల్ట్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని నార్త్ లో పంపిణీ చేయనుంది. భారీ బడ్జెట్ ఫ్రాంచైజీ ‘ధురంధర్’ను విజయవంతంగా అందించిన జియో స్టూడియోస్, ఇప్పుడు ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న హిందీ బెల్ట్‌లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

​రామ్ చరణ్‌కు హిందీ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘RRR’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా ఆయన కనబరిచిన నటన ఉత్తరాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ నేపథ్యంలో, ‘పెద్ది’ చిత్రంలోని బలమైన కంటెంట్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మరి నార్త్ లో పెద్ది ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు