ప్రమాదంలో కొత్త ‘పెళ్లి పుస్తకం’ నిర్మాత నాగి రెడ్డి మృతి.

ప్రమాదంలో కొత్త ‘పెళ్లి పుస్తకం’ నిర్మాత నాగి రెడ్డి మృతి.

Published on Feb 21, 2015 5:52 PM IST

nagi-reddy
రాహుల్ రవీంద్రన్, నీతి టేలర్ జంటగా నటించిన ‘పెళ్లి పుస్తకం’ నిర్మాతలలో ఒకరైన నాగి రెడ్డి ఇకలేరు. అనంతపూర్ నుండి హైదరాబాద్ వస్తుండగా నగర శివార్లలో అప్పా జంక్షన్ వద్ద కారు ప్రమాదానికి గురవడంతో దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న దర్శకుడు మదన్ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

యువ నిర్మాత ప్రమాదంలో మృతి చెందడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. రామానాయుడు మరణం నుండి ఇంకా చిత్ర పరిశ్రమ కోలుకోలేదు. ఇంతలో మరో దురదృష్టకరమైన వార్త వినాల్సి రావడం శోచనీయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు