ఇంట్రెస్టింగ్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘సూపర్ యోధ’ కాన్సెప్ట్ పోస్టర్

ఇంట్రెస్టింగ్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘సూపర్ యోధ’ కాన్సెప్ట్ పోస్టర్

Published on Apr 13, 2024 11:22 PM IST


టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ ప్రాజక్ట్స్ తో మంచి సక్సెస్ లతో కొనసాగుతోంది. ఇక ఆ సంస్థ నుండి రానున్న 36వ మూవీ అయిన సూపర్ యోధ కాన్సెప్ట్ పోస్టర్ ని నేడు రిలీజ్ చేశారు. ప్రతి చరిత్రకు ఒక రహస్యం ఉంటుంది, కానీ ఈ రహస్యానికే ఒక చరిత్ర ఉంది అంటూ ఎడారిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న కాన్సెప్ట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అందరినీ ఆకట్టుకుంటోంది.

కాగా ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ని ఏప్రిల్ 15న అందించనున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తెలిపారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం సూపర్ యోధ మూవీని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించనుండగా తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్ నెగటివ్ పాత్ర చేయనున్నారని, అలానే మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు చెప్తున్నారు. కాగా అనౌన్స్ మెంట్ రోజున తారాగణం పై పక్కాగా క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు