సుబ్బరాజు కు ప్రశంసల వెల్లువ !

సుబ్బరాజు కు ప్రశంసల వెల్లువ !

Published on Aug 4, 2018 12:26 PM IST

Subbaraj

‘ఖడ్గం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయామై ఆ తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు సుబ్బరాజు. ఈచిత్రం తరువాత ఆయన వెనుతిరిగి చూసుకులేదు. తెలుగు ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు సంపాదిస్తూ ప్రతినాయకుడి గా , సహాయక పాత్రల్లో నటిస్తూ బిజీ అవుతున్నారు సుబ్బరాజు. ఇక నిన్న అయన చేసిన ఒక మంచి పనికి ప్రశంసలు దక్కుతున్నాయి.

నిన్న జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో సుబ్బరాజు మరియు మంత్రి కేటిఆర్ లు పాల్గొన్నారు. ఆ ఫంక్షన్ లో సుబ్బరాజు , కే టి ఆర్ దగ్గరకు వచ్చి ముఖ్య మంత్రి సహాయ నిధి కి చెక్ ను విరాళం గా ఇచ్చారు. ఆ సందర్భం లో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆఫొటో చూసిన పలువురు సుబ్బరాజు చేసిన పనిని అభినందిస్తున్నారు. ఇక ఇటీవల యువ హీరో విజయ్ దేవరకొండ తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ను వేలం వేసి తద్వారా వచ్చిన 25లక్షల రూపాయలను సియం సహాయ నిధికి విరాళం గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు