పర్ఫెక్ట్ రన్ టైమ్ తో “టిల్లు స్క్వేర్”?

పర్ఫెక్ట్ రన్ టైమ్ తో “టిల్లు స్క్వేర్”?

Published on Mar 25, 2024 7:17 PM IST

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్. మార్చి 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు వారు యూ/ఎ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా రన్ టైమ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

మొదటి పార్ట్ డీజే టిల్లు కంటే కాస్త తక్కువ రన్ టైమ్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం దాదాపు 1 గంట 58 నిమిషాల నిడివి కలిగి ఉన్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నేహా శెట్టి ఇందులో అతిధి పాత్రలో కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పై బ్యానర్ లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు