పేట సెన్సార్ టాక్ !

Published on Jan 8, 2019 9:50 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘పేట’ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం ఈ చిత్రం తో వింటేజ్ రజినీ ని గుర్తుకుతెచ్చాడట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. రజినీ స్టైల్ ని, మ్యానరిజం ను పూర్తిగా వాడుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. దాంతో ఈ చిత్రం తలైవా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనుందని సమాచారం. అలాగే ఈ చిత్రంలో కామెడీ తో పాటు యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయని సమాచారం.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింన ఈ చిత్రం లో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ,శశి కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం యూ ఎస్ లో భారీ స్థాయిలో విడుదలకానుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు , తమిళ భాషల్లోవిడుదలకానుంది. తెలుగులో నవాబ్ , సర్కార్ చిత్రాలను విడుదలచేసిన అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని కూడా విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More