ఫోటో మూమెంట్ : కొండంత బలం అంటే ఇదే అంటున్న భద్రం

Published on Mar 14, 2021 11:32 am IST

మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ చార్మీతో తీసిన “జ్యోతి లక్ష్మి” సినిమాతో పరిచయం అయ్యిన భద్రం రోల్ ను ఆ సినిమా చూసిన ఏ ఒక్కరూ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. అయితే ఈ నిజ జీవితంలో కూడా భద్రం అనే పిలవబడే ఈ టాలెంటడ్ నటుడు లేటెస్ట్ గా షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే భద్రం కోసం చాలా మందికి కొన్ని విషయాలు తెలియక పోవచ్చు. అతడు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి అల్లుడు. ఈ విషయంలో కొన్నాళ్ల కితమే చాలా మందికి తెలిసిన విషయం. మరి ఇప్పుడు తన మామ సోము వీర్రాజుతో మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో మధ్యలో తాను నిలబడి ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

“కొండంత బలం అంటే ఇదేనేమో ( అటు- ఇటు)” అంటూ వారిద్దరినీ అభివర్ణిస్తూ ఆ గౌరవం, విధేయలతో ఆ ఫొటోలో కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే భద్రం షేర్ చేసుకున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :