ఫోటో మూమెంట్ : ప్లెజెంట్ పిక్ తో తన భార్యకి విష్ చేసిన చిరంజీవి

ఫోటో మూమెంట్ : ప్లెజెంట్ పిక్ తో తన భార్యకి విష్ చేసిన చిరంజీవి

Published on Feb 18, 2024 11:00 AM IST

గత కొన్ని రోజులు కితమే మెగాస్టార్ చిరంజీవి తన తన భార్య సురేఖ తో కలిసి యూఎస్ కి చిన్న వెకేషన్ నిమిత్తం వెళుతున్నట్టుగా తెలిపిన సంగతి తెలిసిందే. అలా యూఎస్ లో తమ వెకేషన్ సహా మెగాస్టార్ కొన్ని ముఖ్యమైన పనుల్లో కూడా పాల్గొంటుండగా అక్కడ విషయాలు విశేషాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. మరి అలా లేటెస్ట్ గా మరో బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.

మరి చిరు తన సతీమణి సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా తమ ఇద్దరిది ఒక బ్యూటిఫుల్ స్నాప్ పెట్టి “నా జీవన రేఖ నా సౌభాగ్య రేఖ నా భాగస్వామి సురేఖ!” అంటూ తన మార్క్ స్టైల్ లో నా లైఫ్ లైన్ నా గ్రేటెస్ట్ పిల్లర్ అయినటువంటి సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తాను తెలిపారు. దీనితో ఈ ప్లెజెంట్ పిక్ తో కూడిన ఈ పోస్ట్ ఫ్యాన్స్ లో మరింత ఆనందాన్ని నింపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు