ఫోటో మూమెంట్ : తన పెట్స్ కి వింతైన పేర్లు పెట్టిన “డబుల్ ఇస్మార్ట్” నిర్మాత

ఫోటో మూమెంట్ : తన పెట్స్ కి వింతైన పేర్లు పెట్టిన “డబుల్ ఇస్మార్ట్” నిర్మాత

Published on May 24, 2024 8:43 PM IST

ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రానికి పూరి దర్శకత్వంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ తనతో పాటుగా ఛార్మి కూడా మరో నిర్మాతగా చేస్తుంది. అయితే ఈమె లేటెస్ట్ గా తనకి గిఫ్ట్ గా వచ్చిన రెండు కుక్క పిల్లలు ఫొటోస్ షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసింది.

అయితే తన పెట్స్ కి ఆమె పెట్టిన పేర్లు మాత్రం మంచి వింతగా ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకదానికి ‘ఐటెం రాజా’ అలాగే ఇంకోదానికి ‘బంగారం’ అని పూరి మార్క్ పేర్లనే పెట్టారు. అలాగే వాటికి తమ పూరి కనెక్ట్స్ ఫ్యామిలీ లోకి వెల్కమ్ చెబుతున్నామని తెలిపింది. ఇక మరో పక్క డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) షూటింగ్ ఇప్పుడు భారీ షెడ్యూల్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా మేకర్స్ ఈ ఏడాదిలోనే పాన్ ఇండియా రిలీజ్ కి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు