ఫోటో మోమెంట్ : డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఫోటో మోమెంట్ : డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

Published on Apr 13, 2024 7:07 PM IST

టాలీవుడ్ స్టార్ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. దీనితో పాటు ఇప్పటికే బుచ్చిబాబు సన తో ఒక మూవీ అలానే సుకుమార్ తో మరొక మూవీ కమిట్ అయ్యారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి చెన్నైలోని వేల్స్ యూనివర్సీటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.

నేడు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్‌కు డాక్టరేట్‌ను ప్రధానం చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇకపై మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాస్తా డా. రామ్ చరణ్ అయిపోయారు. కాగా తమ హీరోకు డాక్టరేట్ లభించడంతో చరణ్ ఫ్యాన్స్ ఆయనకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు