ఫోటో మొమెంట్ : ‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ లో మణిశర్మ తో పూరి జగన్నాథ్

ఫోటో మొమెంట్ : ‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ లో మణిశర్మ తో పూరి జగన్నాథ్

Published on Jan 25, 2024 5:00 PM IST


యువ నటుడు ఉస్తాద్ రామ్ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో ఛార్మి తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తో కలిసి పూరి జగన్నాథ్ పాల్గొన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ లో సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో ఈ మూవీ కోసం కూడా అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారట మణిశర్మ. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీ తప్పకుండా మొదటి భాగాన్ని మించి సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు