ఫోటో మూమెంట్ : తన భార్యతో 43 వసంతాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్

ఫోటో మూమెంట్ : తన భార్యతో 43 వసంతాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్

Published on Feb 27, 2024 6:16 PM IST

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి రీసెంట్ గానే తాను గెస్ట్ రోల్ లో నటించిన చిత్రం “లాల్ సలాం” కూడా వచ్చింది. ఇక ఈ చిత్రం రిలీజ్ తర్వాత మళ్ళీ రజినీ వెట్టాయన్ లో బిజీగా మారగా ఈరోజు అయితే ఓ స్పెషల్ డే వచ్చింది. మరి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తన తల్లిదండ్రుల పిక్ ని షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది.

ఈరోజుతో తన అమ్మ నాన్న లు 43 వసంతాలు భార్యాభర్తలుగా పూర్తి చేసుకున్నారని అలాగే ఆ 43 ఏళ్ళు కితం ఇద్దరు మార్చుకున్న ఉంగరం గొలుసు మా అమ్మ ఇప్పటికీ పదిలంగా దాచింది అని గొలుసు మెడలో వేసుకున్న రజినీ అలాగే తన ఉంగరాన్ని చూపిస్తున్న లతా రజినీకాంత్ లు పోజ్ ఇచ్చారు. దీనితో ఈ స్పెషల్ పిక్ ఫ్యాన్స్ లో బెస్ట్ మూమెంట్స్ లో ఒకటిగా నిలిచింది. దీనితో ఐశ్వర్య పోస్ట్ చేసిన ఈ పోస్ట్ అండ్ పిక్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు