ఫోటో మోమెంట్ : గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ & జాకీ భగ్నానీ ల వివాహం

ఫోటో మోమెంట్ : గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ & జాకీ భగ్నానీ ల వివాహం

Published on Feb 22, 2024 12:06 AM IST

స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన ఈ భామ నేడు అతడితో కలిసి గోవాలో బంధుమిత్రుల సమక్షంలో అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారు. వీరి వివాహం గోవాలో ఎంతో వైభవోపేతంగా జరిగింది.

ఇక వివాహానంతరం తన భర్త జాకీతో కలిసి దిగిన వివాహ ఫోటోలని రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు రకుల్. ఇక వీరిద్దరి వివాహం సింధి మరియు సిక్కు పద్ధతుల్లో సంప్రదాయబద్ధంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు నూతన వధూవరులైన రకుల్, జాకీ లకు సోషల్ మీడియా వేదికల ద్వారా వారికి వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రస్తుతం రకుల్, జాకీల వివాహ ఫోటోలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు