ఫోటో మూమెంట్: ఉస్తాద్ సెట్స్ నుంచి భగత్ గారి తాలూకా అంటున్న శ్రీలీల!

UBS 1 3

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం డీసెంట్ రన్ తో కొనసాగుతుంది. ఇక ఈ సినిమాతోనే రాశీ ఖన్నా, శ్రీలీల మొదటిసారి పవన్ పక్కన నటించారు. మరి లేటెస్ట్ గా శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు ఆమె షేర్ చేసుకుంది.

మరి వీటిలో పవన్ తో ఓ బ్యూటిఫుల్ సెల్ఫీ మంచి ఫోటో మూమెంట్ గా మారింది. దానితో పాటుగా దర్శకుడు హరీష్ శంకర్ తో వర్క్, పవన్ తో సాంగ్ చేసిన దృశ్యాలు కూడా పంచుకొని సినిమాలో డైలాగ్ భగత్ గారి తాలూకా అంటూ ఇంట్రెస్టింగ్ కాప్షన్ కూడా ఆ పోస్ట్ కి పెట్టింది. దీనితో ఈ ఫోటోలు అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్, థమన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version