ఫోటో మోమెంట్ : ట్రెండీ స్టైలిష్ లుక్ లో సూపర్ స్టార్

ఫోటో మోమెంట్ : ట్రెండీ స్టైలిష్ లుక్ లో సూపర్ స్టార్

Published on Apr 27, 2024 11:01 PM IST

స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 కోసం మేకోవర్ పరంగా న్యూ లుక్ తో సిద్దమవుతున్నారు. ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మించనుండగా త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ కోసం ఫుల్ గా క్రాఫ్ పెంచుతున్న మహేష్, తాజాగా తన పిఆర్ మేనేజర్ అయిన సీఎం విశ్వ బర్త్ డే సందర్భంగా భార్య నమ్రతతో కలిసి అతడికి విషెస్ తెలుపుతూ ఒక పిక్ దిగారు. కాగా ఆ పిక్ లో సూపర్ స్టార్ మహేష్ ట్రెండీ అవుట్ ఫిట్ తో స్టైలిష్ లుక్ లో అదిరిపోయారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు