ఫోటో మొమెంట్ : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కో స్టార్స్ తో సూపర్ స్టార్ మహేష్

ఫోటో మొమెంట్ : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కో స్టార్స్ తో సూపర్ స్టార్ మహేష్

Published on Jan 16, 2024 1:46 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అందరి అంచనాలు అందుకుని మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మొదట్లో కొందరు కావాలనే ఈ మూవీ పై సోషల్ మీడియా మాధ్యమాల్లో నెగటివిటి ప్రచారం చేయడం, అనంతరం మెల్లగా మూవీ ఆడియన్స్ ని కనెక్ట్ కావడం జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం పలు ఏరియాలో మంచి కలెక్షన్ రాబడుతోంది.

విషయం ఏమిటంటే, తమ మూవీ మొత్తంగా సక్సెస్ బాటలో నడుస్తుండడంతో తనతో కలిసి గుంటూరు కారంలో వర్క్ చేసిన కో స్టార్స్ కి నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇంట్లో ప్రత్యేకంగా పార్టీ ఇచ్చి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీ లో శ్రీలీల, సతీమణితో కలిసి దిల్ రాజు, మీనాక్షి చౌదరి, నాగవంశీ పాల్గొనున్నారు. ఆ పార్టీ యొక్క ఫోటోలను స్వయంగా మహేష్ బాబు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. కాగా రేపు మరియు ఎల్లుండి గుంటూరు కారం టెక్నీకల్ టీమ్ కి అలానే డిస్ట్రిబ్యూటర్స్ కి మహేష్ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు