ఫోటో మూమెంట్ : “విశ్వంభర” సెట్స్ లో మెగాస్టార్ తో టాలీవుడ్ డైరెక్టర్స్ మీట్

ఫోటో మూమెంట్ : “విశ్వంభర” సెట్స్ లో మెగాస్టార్ తో టాలీవుడ్ డైరెక్టర్స్ మీట్

Published on Apr 11, 2024 7:30 PM IST

మన తెలుగు సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే “విశ్వంభర”. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా గడిచిన ఈ మూడు రోజుల్లోనే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ సినిమా సెట్స్ నుంచి వస్తున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ దర్శకులు దాదాపు అందరు మెగాస్టార్ ని విశ్వంభర సెట్ లో మీట్ అవ్వడం జరిగింది.

అయితే గత కొన్నాళ్ల కితమే తెలుగు సినిమా దర్శకుల ప్రెసిడెంట్ గా “గుడుంబా శంకర్” దర్శకుడు వీరశంకర్ ఎంపిక అయ్యిన సంగతి తెలిసిందే. మరి తాజాగా మెగాస్టార్ ని వీరశంకర్ సహా అనేకమంది యువ దర్శకులు సహా సీనియర్ దర్శకులు కూడా కలవడం జరిగింది.

మరి ఇందులో జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్, బేబి దర్శకుడు సాయి రాజేష్, శ్రీరామ్ ఆదిత్య తదితరులు కలిసి ఈ మే 4న జరగనున్న తెలుగు సినిమా దర్శకుల దినోత్సవం వేడుకకి ఆహ్వానించారు. దీనితో ఈ దర్శకుల సమ్మేళనంతో మెగాస్టార్ మెగా ఫ్రేమ్ చూడ ముచ్చటగా కనిపిస్తుంది. దీనితో పిక్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు