లేటెస్ట్ గా బాలీవుడ్ మెగాస్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) పుట్టినరోజు గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ వేడుకల్లో ఫ్యాన్స్ కి తన కొత్త చిత్రం తాలూకా టీజర్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. అయితే సల్మాన్ పుట్టినరోజు వేడుకల్లో ఇండియా వైడ్ గా ఉన్నటువంటి స్టార్స్ అంతా తన కోసం వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
మరి ఈ వేడుకల్లో ఓ మ్యాడ్ ఫ్రేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బర్త్ డే వీరుడు సల్మాన్ ఖాన్ అలాగే మాజీ భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం ఎస్ ధోని (MS Dhoni at Salman Birthday Bash) అలాగే వారితో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంకా నటుడు బాబీ డియోల్ కూడా కలిసి కనిపించడం అనేది క్రేజీగా మారింది.
నిజానికి ఇలాంటి ఒక కలయికతో కూడిన ఫ్రేమ్ ని మాత్రం డెఫినెట్ గా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. కానీ వీరితో పాటుగా ధోని కూడా కలిసి కనిపించడం అనేది అన్ ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. దీనితో ఈ మ్యాడ్ ఫ్రేమ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
