పిక్ టాక్ : వైట్ అండ్ వైట్ లో ఈ సినిమా గుర్తు చేసిన మహేష్ బాబు

పిక్ టాక్ : వైట్ అండ్ వైట్ లో ఈ సినిమా గుర్తు చేసిన మహేష్ బాబు

Published on Apr 2, 2024 12:41 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “గుంటూరు కారం” (Guntur Kaaram) తో తన కెరీర్ లో భారీ గ్రాసర్ ని అందుకోగా ఇపుడు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో అయితే తాను సెన్సేషనల్ ప్రాజెక్ట్ (SSMB 29) ని చేయడానికి సిద్ధం అవుతున్నాడు. మరి మహేష్ బాబు ఈ సినిమా కోసం కొత్త లుక్ లోకి మారుతుండగా దానికి ముందు ఉన్న కొన్ని స్మార్ట్ లుక్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కి ఓ రేంజ్ కిక్ ని ఇస్తున్నాయి.

మహేష్ ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ ఇండియా లోనే సూపర్ హ్యాండ్సమ్ హీరో అని తెలిసిందే. మరి తాను ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా మారగా వాటి తాలూకా లేటెస్ట్ పిక్స్ కొన్ని వైరల్ గా మారాయి. మరి వీటిలో లేటెస్ట్ గా వచ్చిన పిక్ అయితే వింటేజ్ మహేష్ ని గుర్తు చేస్తుంది. మహేష్ బాబు మొత్తం వైట్ అండ్ వైట్ లో తాను ఓ పిక్ ని పోస్ట్ చేయగా ఇందులో చాలా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా తాను కనిపిస్తున్నాడు.

అయితే ఈ లుక్ లో చూస్తే మహేష్ బాబు వింటేజ్ చిత్రం “సైనికుడు” సినిమా గుర్తు రాదు అందులో ఓ సాంగ్ కి మహేష్ బాబు త్రిష ఇద్దరూ కూడా ఇలా వైట్ అండ్ వైట్ లోనే కనిపిస్తారు. దీనితో మళ్ళీ మహేష్ ఆరోజులు గుర్తు చేసాడని చెప్పాలి. ఇక ఇప్పుడు మహేష్ నటించనున్న వరల్డ్ క్లాస్ సినిమా కోసం ఆసక్తిగా ప్రపంచ వీక్షకులు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు