అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ‘వృష కర్మ’ కోసం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే వచ్చిన గ్లింప్స్ తో ఆడియెన్స్ కి థియేటర్స్ లో సాలిడ్ థ్రిల్స్ గ్యారెంటీ అనే హామీ ఇచ్చారు. అయితే ఈ సినిమా కోసం నాగ చైతన్య ఓ కొత్త లుక్ ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
గత చిత్రం తండేల్ లో డీ గ్లామ్ లుక్ లోకి మారిన చైతు ఈ సినిమా కోసం మాత్రం మంచి స్టైలిష్ గా రెడీ అయ్యాడు. ఇక లేటెస్ట్ గా సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా తాను షేర్ చేసుకోవడం జరిగింది. ఇందులో తన 6 ప్యాక్ బాడీ ఫొటోతో ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాడు అని చెప్పవచ్చు.
మంచి బల్క్ బాడీని ఈ సినిమా కోసం తాను సిద్ధం చేస్తున్నట్టుగా జిమ్ నుంచి డంబెల్స్ పట్టుకొని ఉన్న పిక్ ని షేర్ చేయడం జరిగింది. దీనితో వృష కర్మ కోసం తాను ఎలాంటి డెడికేషన్ ని చూపిస్తున్నాడో అర్ధం అవుతుంది. ఇక దీనితో పాటుగా సెట్స్ నుంచి మరికొన్ని ఫోటోలు షేర్ చేయగా ఫ్యాన్స్ లో అవి వైరల్ గా మారాయి.
