పిక్ టాక్ : సాలిడ్ ఫిట్నెస్ తో అదరగొట్టిన “RRR” నటుడు

పిక్ టాక్ : సాలిడ్ ఫిట్నెస్ తో అదరగొట్టిన “RRR” నటుడు

Published on Feb 18, 2024 7:05 AM IST

మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు భారీ చిత్రాల్లో దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కించిన ఈ చిత్రం గ్లోబల్ సెన్సేషనల్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు కూడా ఏ రేంజ్ ఫిట్నెస్ తో కనిపించి ఆశ్చర్య పరిచారో చూసాం కానీ ఇదే సినిమాలో అత్యంత ముఖ్య పాత్రపోషించిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తన లేటెస్ట్ ఫిట్నెస్ తో అదరగొట్టాడు.

తన సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. షర్ట్ లెస్ గా ఈ ఏజ్ లో కూడా మంచి ఫిట్నెస్ ని అజయ్ మైంటైన్ చేస్తూ కనిపించడం ప్రస్తుత జెనరేషన్ యూత్ కి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. దీనితో ఇలా అజయ్ లేటెస్ట్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది. ఇక ఈ అజయ్ నటిస్తున్న పలు చిత్రాలు ఈ ఏడాదిలో రిలీజ్ కి రాబోతుండగా తాను నటించిన హిట్ చిత్రం “రాయిస్” సీక్వెల్ లో ఇప్పుడు అజయ్ పాల్గొంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు