పిచ్చోడు మూవీ ఫస్ట్ లుక్ విడుదల.

పిచ్చోడు మూవీ ఫస్ట్ లుక్ విడుదల.

Published on Nov 10, 2019 5:44 PM IST

Pichhodu 1

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా ‘పిచ్చోడు’. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది.నూతన నటీనటులైన క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా ‘పిచ్చోడు’ చిత్రంతో పరిచయం అవుతున్నారు.ఇష్టపడిన అమ్మాయి ప్రేమకోసం పరితపించే ఓ కుర్రాడి కథగా పిచ్చోడు చిత్రం తెరకెక్కినట్లు సమాచారం. ఓ జంట మధ్య నడిచే సీరియల్ లవ్ స్టోరీని దర్శకుడు తెరకెక్కించారు.

ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. కాగా ఈ చిత్రానికి సంగీతం బంటి అందించారు.

తాజా వార్తలు