మరోసారి ఖరారైన ‘పిల్లా నువ్వులేని జీవితం’ రిలీజ్ డేట్

Pilla-Nuvvu-Leni-Jeevitham
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కావడానికి సిద్దమైన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ‘రేయ్’ పూర్తినప్పటికీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. అందుకే తను చేసిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ విడుదలకి సిద్దమవుతోంది.

ఈ సినిమాని ఈ చిత్ర టీం నవంబర్ 14న రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారని ఇది వరకే తెలియజేశాం. ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ చిత్ర టీం కూడా ఖరారు చేసారు. దిల్ రాజు, అల్లు అరవింద్, ఎఎస్ రవికుమార్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ నవంబర్ 14న రిలీజ్ కచ్చితంగా అవుతుందని ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.

సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version