సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ రిలీజ్ డేట్.?

Pilla-Nuvvu-Leni-Jeevitham
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కావడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా ‘రేయ్’ ని మొదలు పెట్టి పూర్తి చేసినప్పటికీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చేసిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

నిన్ననే ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 18న అందరి మెగా హీరోల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 14న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version