‘పింక్’ రీమేక్ తో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయమై ఇన్నాళ్ళు ఒక క్కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. తాజా సమాచారం మేరకు ఈ నెల 20 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. పవన్ సైతం త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నారు. ‘పింక్’ హిందీ, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించి ఉండటంతో తెలుగు రీమేక్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పవన్ ర్రీఎంట్రీ సినిమా కావడంతో ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. రాజకీయ పరమైన పనుల్లో బిజీ ఉన్న పవన్ ఈ చిత్రం కోసం కొద్ది డేట్స్ మాత్రమే కేటాయించి ఉండటంతో వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.


