సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల

​‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

​ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సునిశిత హాస్యం కలగలిపి యువతకు మంచి సందేశాన్నిచ్చేలా కథను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం పేర్కొంది. మన చుట్టూ తిరిగే సహజమైన పాత్రల నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాలో హాస్య నటుడు బ్రహ్మానందం వాయిస్ ఓవర్ అందించడం ప్రత్యేక విశేషం. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

​ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి జి.సి. క్రిష్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది.

Exit mobile version