సుకుమార్ చేతుల మీదుగా ప్లే బ్యాక్ టీజర్ !

సుకుమార్ చేతుల మీదుగా ప్లే బ్యాక్ టీజర్ !

Published on Dec 5, 2019 7:02 AM IST

కవిత పెద్దినేని సమర్పణలో ప్రసాద్ రావు పెద్దినేని నిర్మాతగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్లే బ్యాక్. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… చిన్న సినిమాలు బాగా ఆడుతున్న రోజులివి. ఈ సినిమాలో పనిచేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలువుతున్నాను. కమ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. కెమెరామెన్ బుజ్జి తక్కువ టైమ్ లో బాగా తీశాడు. నేను చెయ్యలనున్న కథ ఈ ప్లే బ్యాక్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. హిట్ ఆయే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. హరిప్రసాద్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు.

డైరెక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ… హీరో దినేష్ తేజ్ కష్టపడి చేశాడు, అనన్య కథ విని వెంటనే ఒప్పుకుంది. డిఫరెంట్ వెరీయేషన్స్ లో ఈ అమ్మాయి నటించింది. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశాను, అందుకు కారణం కెమెరామెన్ బుజ్జి. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి బొంతల ఈ సినిమాను అర్థం చేసుకొని బాగా కట్ చేశాడు. టీవీ 5 మూర్తి మా సినిమాలో మంచి పాత్ర చేశాడు. సుకుమార్ నాకు తమ్ముడు, నేను సుకుమార్ 25 ఏళ్లుగా ఫ్రెండ్స్. మీడియా సపోర్ట్ తో ఈ సినిమా మరింత ఎక్కువ ప్రేక్షకులకు చేరువవుతుంది అనుకుంటున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. అందుకు కారణం మీడియా. అలాగే ప్లే బ్యాక్ సినిమాను కూడా మీడియా సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న. టీజర్ బాగుంది, సినిమా అంతకంటే బాగుంటుందని నమ్ముతున్నాను. నిర్మాత ధనుంజయ్ గారికి, డైరెక్టర్ హరి ప్రసాద్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు