సస్పెన్సు థ్రిల్లర్ “ప్లే” మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Published on Nov 17, 2019 7:07 pm IST

అభినవ్ సింగ్ రాఘవ్, గజాలా, నైనా శర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘ప్లే’. ఈ చిత్రానికి మోక్ష్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ తో పాటు ఎడిటింగ్ కూడా డైరెక్టర్ మోక్ష్ చేయడం విశేషం. పి.ఎల్.రామ్ ప్రసాద్ డీఓపి. రాజ సులోచన ఈ చిత్రానికి నిర్మాత. టి.ఎం.శేఖర్ సహ నిర్మాత. హర హర మహాదేవ్ క్రియేషన్స్ సమర్పణలో… రాయ్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంటెన్సివ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. రేసీగా ఉండే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. తర్వాతి సీన్ ఏం జరుగుతుందా…. అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతీ పనికి ఓ ఉద్దేశ్యం ఉంటుందనేది ఈ చిత్రం మెయిన్ పాయింట్.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఈ సినిమాలో ఉండే ప్లే ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటీనటులు కొత్త వారైనప్పటికీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చిత్ర దర్శకుడు మోక్ష్ అన్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎడిటింగ్ చాలా కీలకం కానుంది. చిత్ర నిర్మాణంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా నిర్మించారట.

సంబంధిత సమాచారం :

X
More