పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమా ఆడియో లాంచ్ జనవరి 4న జరిగింది. ఈ ఆడియో వేడుకలో ఓ బాధాకరమైన విషయం చోటు చేసుకుంది. అదే కొందరు ఆగంతకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన ఒకటని గొంతుకోసి పారిపోయారు. అతనికి ప్రాణాపాయం తప్పినా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయంపై పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. పోలీసులు అక్కడ ఉన్న పబ్లిక్ ని విచారించారు. అలాగే మీలో ఎవరన్నా అక్కడ జరిగిన దారుణాన్ని చూసి ఉంటే, 9493549415 నెంబర్ కి ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయండి. ఆ రోజు గొడవ ఆడియో లాంచ్ పాస్ ల విషయంలో జరిగిందని అంటున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ లో స్పందించాడు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని, అలాగే అతను కోలుకున్నాక అతన్ని వెళ్లి కలుస్తానని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు.
