14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన మా ఊరి పొలిమేర 2!

14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన మా ఊరి పొలిమేర 2!

Published on Apr 29, 2024 1:31 PM IST

మా ఊరి పొలిమేర చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం కి వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ మా ఊరి పొలిమేర 2 చిత్రాన్ని తెరకెక్కించి, గతేడాది థియేటర్ల లో విడుదల చేశారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, దేవియాని శర్మ, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మళ్లీ అందరి దృష్టిలో పడింది. ఏప్రిల్ 30, 2024న భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ – 2024లో ఈ చిత్రం అధికారికంగా ఎంపిక చేయబడింది.

ఈ చిత్రం కి దక్కిన గౌరవం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు. గ్యాని సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. బాలాదిత్య, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి మరియు సాహితీ దాసరి ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు