ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న భారీ పీరియాడిక్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. రచయిత కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల ఆధారంగా తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చోళరాజుల చారిత్రక గాధ నేపథ్యంలో రూపొందనుంది. విక్రమ్, కార్తీ,పార్తీబన్,విజయ్ సేతుపతి, జయం రవి, మోహన్ బాబు, కీర్తి సురేష్, అమలాపాల్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.
కాగా ఈ ఏడాది నవంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకెళ్లనుందట. ఈ పీరియాడిక్ చిత్రాన్ని ఇండియాతో పాటు పలు దేశాలలో చిత్రీకరించనున్నారట. థాయిలాండ్ లోని అడవులలో 100రోజుల నిరవధిక షూటింగ్ జరపనున్నారని సమాచారం. పొన్నియన్ సెల్వన్ సినిమాని మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
