పూజా హగ్దే తన పని ముగిసింది

pooja hedge
ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ మీద ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇన్నిరోజులు మోషన్ పోస్టర్లు, పోస్టర్లతోనే సరిపుచ్చిన చిత్ర టీమ్ ఈసారి టీజర్‌తో వస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు సందర్బంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు.

ఇప్పుడు తారాగణం సహా చిత్ర బృందం మొత్తం టీజర్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కథానాయిక పూజాహెగ్డే ఇప్పటికే తన డబ్బింగ్ కంప్లీట్ చేసేశారు. ఈ విషయం చెబుతూ.. ఆమె ‘పొద్దు పొద్దున్నే టీజర్ కోసం డబ్బింగ్ చెప్పాను. ఫిబ్రవరి 14న వచ్చేస్తున్నాం’ అంటూ ఇన్స్టాగ్రమ్ ద్వారా తెలిపారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు ఇంకొన్ని ఇతర భాషల్లో కూడ విడుదలచేయనున్నారు. ఇకపోతే విడుదల తేదీ విషయంలో త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు చిత్ర బృందం.

Exit mobile version