స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ప్లాప్‌లతో తీవ్ర కెరీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ల నుంచి ఇటీవల జూలై 23న వచ్చిన ‘జన నాయగన్’ వరకు ఆమె నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. సక్సెస్ లేకపోయినా భారీ పారితోషికం డిమాండ్ చేస్తుండటంతో పాటు, తాజా సినిమాల్లో ఆమె సీన్లను ఎడిటింగ్ లో ట్రిమ్ చేయడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.
అయినప్పటికీ, సోషల్ మీడియా క్రేజ్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఆమెకు స్థిరమైన ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం చేతిలో పెద్ద ప్రాజెక్టులు లేనప్పటికీ, ఆగస్టులో ప్రారంభమయ్యే రవితేజ కొత్త సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరి మాస్ రాజా సినిమాతో అయినా ఈ భామ సక్సెస్ పూజ ఫలిస్తుందో లేదో చూడాలి.


