హలో ఏంటా తొందర అంటున్న పూజ హెగ్డే

Published on Apr 1, 2020 2:42 pm IST

పూజ హెగ్డే తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. అందులో నిజం లేదని తెలిపింది. పూజ హెగ్డే తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఓ చిత్రం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న అరువా చిత్రంలో సూర్యకి జంటగా పూజ హెగ్డే ని తీసుకున్నట్లు బాగా ప్రచారం జరిగింది. ఐతే ఇందులో ఎటువంటి నిజం లేదని పూజ చెప్పుకొచ్చారు. మీరు తొందర పడకండి. నేను ఇంత వరకు ఎటువంటి తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. ఐతే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ నావద్దకు వచ్చాయి. అన్ని కుదిరి అవి ఒకే అయితే పిచ్చ హ్యాపీ అని ఆమె చెప్పారు.

ఇక ఈ ఏడాది అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పూజ టాలీవుడ్ లో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీలో పూజ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్కినేని యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో కూడా ఆమె చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More