మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఆమేనట

Published on Apr 7, 2021 10:29 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్టే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ‘సర్కారు వారి పాట’ పూర్తైపోగానే మహేష్ త్రివిక్రమ్ సినిమా పనులు స్టార్ట్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ కూడ మొదట్లో తారక్ హీరోగా ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది సెట్టయ్యే సూచనలు లేవు. అందుకే మహేష్ బాబుతోనే వెళ్లిపోవాలని అనుకుంటున్నారట. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ సినిమా అనేసరికి ఫ్యాన్స్ సైతం ఎగ్జైట్ ఫీలవుతున్నారు.

ఇక ఈ సినిమాలో కథానాయిక విషయానికొస్తే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో కథానాయకిగా నటించనుందట. పూజా గతంలో కూడ మహేష్ బాబుతో ‘మహర్షి’, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేశారు. అందుకేనేమో మహేష్, త్రివిక్రమ్ ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ చేయడానికి ఆమెనే కథానాయకిగా ఎంచుకుని ఉండవచ్చు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రావొచ్చు. షూటింగ్ సైతం ఈ ఏడాదిలోనే మొదలవుతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :