ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అప్డేట్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తారక్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈమె ఈరోజు నుండే ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అయ్యారు. హైదారబాద్లో చిత్రీకరణ నడుస్తోంది.

ఇక ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు మంచి ట్యూన్స్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version