‘పూజా హెగ్డే’కే ఫిక్స్ అయ్యేలా ఉన్నారు !

Pooja Hegde

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించి అప్ డేట్స్ గురించి బన్నీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరూ అని నెటిజన్లలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పూజా హెగ్డేకే త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి కలిసి పనిచేసింది.

ఇక ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత బన్నీ త్రివిక్రమ్ కలిసి చేస్తోన్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ను కాస్త వైవిధ్యంగా చూపించనున్నాడు త్రివిక్రమ్. అందుకు తగ్గట్లుగానే త్రివిక్రమ్ సూచన మేరకు బన్నీ కాస్త వెయిట్ తగ్గుతున్నాడు. అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చబోతున్నాడని సమాచారం. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్. మరి ఈ సినిమాలో బన్నీలో ఏం కొత్తగా చూపిస్తాడో చూడాలి.

Exit mobile version