‘ఆచార్య’లో ఆమెది ఎమోషనల్ క్యారెక్టర్ అట !

Published on Apr 5, 2021 12:00 am IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ ‘పూజా హెగ్డే’ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆమెది కేవలం 20 నిమిషాల పాత్ర అని.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో పూజా రోల్ ఉంటుందని.. ఆమె పాత్ర చనిపోతుందని.. మొత్తానికి ఆమెది ఎమోషనల్ రోల్ అని తెలుస్తోంది. ఇక తన 20 నిమిషాల పాత్ర కోసం పూజా ఏకంగా కోటి రూపాయలు తీసుకుంటుందట.

కాగా ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఆచార్య షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్‌ లేకుండా లూసిఫర్ రీమేక్‌ షూటింగ్‌ లో చిరు జాయిన్‌ అవుతారట.

సంబంధిత సమాచారం :