హృతిక్ రోషన్ సరసన నాగ చైతన్య హీరోయిన్.

హృతిక్ రోషన్ సరసన నాగ చైతన్య హీరోయిన్.

Published on Jul 12, 2014 12:01 PM IST

hruthik-roshan
తెలుగులో నాగ చైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెడ్గే హిందీలో భారి అవకాశం సొంతం చేసుకుంది. హృతిక్ రోషన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ కలయికలో రూపొందనున్న చారిత్రాత్మక సినిమా ‘మొహెంజో దారో’లో హీరోయిన్ గా పూజ హెడ్గేను ఎంపిక చేశారు. ఈ విషయాన్నీ దర్శకుడు దృవీకరించారు.

భారి బడ్జెట్ తో తెరకెక్కనున్న ‘మొహెంజో దారో’లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమకథకు చాలా ప్రాముఖ్యత ఉందట. అక్టోబర్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ అవకాశంతో పూజ హెగ్డే సంతోషంలో తేలియాడుతుంది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో పాటు మెగా వారసుడు వరుణ్ తేజ హీరోగా పరిచయం అవుతున్న శ్రీకాంత్ అడ్డాల సినిమాలో కూడా పూజనే హీరోయిన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు