ఆ యంగ్ హీరో డెబ్యూ కోసం పూజా హెగ్డే.!

Published on May 22, 2020 3:00 am IST

మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ కోసం మన తెలుగు ఆడియన్స్ కు కూడా చాలా మందికి తెలుసు. తెలుగు ఆడియన్స్ కు మణిరత్నంతో తీసిన “ఓకే జాను” తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా కీర్తి సురేష్ తో చేసిన “మహానటి” చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే అది లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం వలన దానినే మనం తనకి హీరోగా తెలుగు డెబ్యూ చిత్రంగా చెప్పలేం. కానీ ఇప్పుడు తాను హీరోగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తన డెబ్యూ చిత్రంతో పలకరించనున్నారు.

అయితే ఈ చిత్రానికి హీరోయిన్ గా పూజా హెగ్డేను లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కథ పూజా వినగా ఈ లాక్ డౌన్ అనంతరం ఈ హైదరాబాద్ వచ్చాక సైన్ చేయనున్నట్టు సమాచారం. మరి వీరి కాంబోలో హను రాఘవ పూడి ఎలాంటి స్క్రిప్ట్ ను చూపిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More