పూజా హెగ్డే పాపులారిటీ మాములుగా లేదు !
Published on Mar 14, 2018 9:01 am IST

‘ముకుంద’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒకే ఒక సినిమా చేసి బాలీవుడ్ వెళ్ళిపోయిన పూజ హెగ్డే అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె మహెష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కథానాయకిగా కుదిరింది.

ఈ పాపులారిటీనే ఆమెను చాలా మంది హీరోయిన్లను, ఇతర సెలబ్రిటీలను వెనక్కు నెట్టి 2017వ సంవత్సరానికిగాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలబడేలా చేసింది. ఇక స్టార్ హీరోయిన్లు కాజల్ జాబితాలో 2వ స్థానంలో నిలువగా, తమన్నా 6వ స్థానంలో, రకుల్ ప్రీత్ సింగ్ 3వ స్థానంలో, అనుష్క 9వ స్థానంలో, అదా శర్మ 5వ స్థానంలో, క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ 10వ స్థానంలో నిలబడ్డారు.

 
Like us on Facebook