పూలరంగడు విడుదల తేది మార్పు

పూలరంగడు విడుదల తేది మార్పు

Published on Jan 23, 2012 11:39 AM IST


సునీల్ యాక్షన్ హీరోగా మారే ప్రయత్నంగా చేస్తున్న చిత్రం ‘పూలరంగడు’. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫిబ్రవరి 3న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. సక్సెస్ఫుల్ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అందించారు.

సునీల్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం చివరి పాట రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. పూలరంగడు చిత్రాన్ని కె అచ్చిరెడ్డి నిర్మిస్తుండగా ఆర్ఆర్ మేకర్స్ వారు సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు