బాలీవుడ్ బిగ్ బ్యానర్ లో పూరి మూవీ..?

Published on May 26, 2020 10:49 am IST

విజయాల సంగతి ఎలా ఉన్నా పూరి టేకింగ్ కి అటు చిత్ర పరిశ్రమలో మరియు సాధారణ ప్రేక్షకులలో భారీగా అభిమానులు ఉన్నారు. హీరోయిజం కి కొత్త భాష్యం చెప్పిన దర్శకుడు పూరి జగన్నాద్. ఇక 2015లో వచ్చిన టెంపర్ మూవీ తర్వాత సరైన హిట్ లేక అల్లాడిన పూరి గత ఏడాది సాలిడ్ హిట్ అందుకున్నారు. హీరో రామ్ తో ఆయన చేసిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం అందుకుంది.

కాగా లాక్ డౌన్ కారణంగా తీరిక దొరకడంతో పూరి ఓ కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేశారట. అలాగే ఆ స్క్రిప్ట్ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి వినిపించగా ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారట. ఆ మూవీ తన నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తా అని పూరికి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఓ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో కరణ్ జోహార్ భాగంగా ఉన్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More