మహేష్ బాబుతో స్టెప్పు లేస్తున్న పూర్ణ

మహేష్ బాబుతో స్టెప్పు లేస్తున్న పూర్ణ

Published on Jan 8, 2015 9:40 PM IST

poorna_mahesh1
‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మళయాళ కుట్టి పూర్ణ ఆ తర్వాత చేసిన ‘అవును’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం ఈ సాంగ్ లో మహేష్ బాబుతో కలిసి పూర్ణ స్టెప్స్ వేస్తోంది. ఈ ట్రెడిషనల్ సాంగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ టెంపుల్ సెట్లో షూట్ చేస్తున్నారు.

ఈ మలయాళ భామ ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ ‘ నేనొక ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ అని తెలుసుకొని ఈ సాంగ్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు నచ్చింది ఓకే చేసాను, అలాగే షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆయన అంత సింపుల్ గా ఉంది నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ వస్తుందని కూడా ఆశిస్తున్నానని’ తెలిపింది.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2015 సమ్మర్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు