బన్ని సినిమాలో పాప్ సింగర్ పాట.!

బన్ని సినిమాలో పాప్ సింగర్ పాట.!

Published on Feb 4, 2015 11:33 AM IST

allu-arjun-devi-sri-prasad

ఇండియాలో బాగా పాపులర్ అయిన ఫోక్ అండ్ ఫ్యూజన్ ఆర్టిస్ట్ అయిన రఘు దీక్షిత్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో ఓ పాట పాడాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. తన ప్రతి మ్యూజిక్ ఆల్బంలో కొత్త కొత్తగా పాటలు ట్రై చేసే దేవీశ్రీ ప్రసాద్ ఈ సారి రఘు దీక్షిత్ తో ఓ పాట పాడించాడు. ఈ విషయాన్ని రఘు దీక్షిత్ తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసాడు.

‘అల్లు అర్జున్ సినిమా కోసం సూపర్ హిట్ కంపోజర్ అయిన దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఓ సూపర్బ్ సాంగ్ రికార్డ్ చేసాము. బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చెయ్యగల మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ’ అని రఘు దీక్షిత్ తెలిపాడు. ‘ది రఘు దీక్షిత్’, ‘జగ్ చంగ’ ఆల్బమ్స్ తో రఘు దీక్షిత్ ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు. రఘు సింగర్ గానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గాను పలు బాలీవుడ్, సౌత్ సినిమాలకు పనిచేసాడు. ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ ని తెలుగు వారికి పరిచయం చేసే దేవీశ్రీ ప్రసాద్ ఈ సారి రఘు దీక్షిత్ తో మేజిక్ చేయనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న సన్ ఆఫ్ సత్యమూర్తి టీం త్వరలో పాటల షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు.

తాజా వార్తలు