
హ్యాట్రిక్ హిట్స్‌తో జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కామెడీ మూవీ ‘శంకరాభరణం’. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా కనిపించనుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే దీపావళి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండడంతో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఫస్ట్ టీజర్ ని లాంచ్ చేసారు. ఈ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
దాంతో ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో మంచి రేటుకి అమ్ముడుపోయిన ఈ సినిమా ఆడియో కూడా రిలీజ్ కాకముందే భారీ మొత్తానికి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. మాకు అందిన సమాచారం ప్రకారం జీ తెలుగు వారు సుమారు 4 కోట్ల రూపాయలకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని కొనుక్కున్నారు. ఈ ఒక్క శాటిలైట్ రైట్స్ తోనే శంకరాభరణం నిర్మాతలు చాలా సేఫ్ జోన్ లోకి వెళ్ళారని చెప్పాలి. అలాగే మిగిలిన అన్ని ఏరియాల నుంచి కూడా ఈ సినిమాకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాతో పాటు ఈ రోజు నుంచి థియేటర్స్ లో ప్రసారం అవుతున్న థియేటర్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆడియోని ఈ నెల్లోనే రిలీజ్ చేయనున్నారు.